
ఆగస్టు 16లోగా ఎల్పీజీ e-KYC తప్పనిసరి.. లేకుంటే సబ్సిడీ బంద్!
గృహ వినియోగదారులు, ఉజ్వల యోజన లబ్ధిదారులు ఆగస్టు 16, 2026 లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని చమురు కంపెనీలు వెల్లడించాయి. ఈ గడువులోగా పూర్తి చేయని పక్షంలో, గృహ ధరలకు సిలిండర్ పొందే అర్హతతో పాటు సబ్సిడీ కూడా నిలిచిపోతుంది. ఉజ్వల పథకం కింద ఏడాదికి 4 రీఫిళ్లపై లభించే రూ.300 చొప్పున సబ్సిడీ కొనసాగడానికి ఈ ప్రక్రియ అత్యంత ముఖ్యం. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా, నేరుగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లి లేదా గ్యాస్ డెలివరీ సిబ్బంది సహాయంతో ఈ-కేవైసీని సులభంగా పూర్తి చేసుకోవచ్చు.




