మంత్రి ఉత్తమ్ పేరు చెప్పి.. రూ.1.70 కోట్లు దోచుకున్న కేటుగాడు

18చూసినవారు
మంత్రి ఉత్తమ్ పేరు చెప్పి.. రూ.1.70 కోట్లు దోచుకున్న కేటుగాడు
TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్పి భారీ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వంలో ఉన్నత స్థాయి సంబంధాలు ఉన్నాయని నమ్మబలికిన బంగారు యాదవ్, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన గ్రీన్ మెట్రో ఇన్‌ఫ్రాటెక్ సంస్థను లక్ష్యంగా చేసుకున్నాడు. పెద్ద ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తానని చెప్పి ఇన్‌ఫ్రా కంపెనీ నుంచి రూ.1.70 కోట్లు వసూలు చేశాడు. అంతేకాకుండా ఖరీదైన కారు, ఐఫోన్ కూడా పొందినట్లు సమాచారం. అతను చివరకు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్