పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని పోస్టాఫీస్ వార్షిక బీమా పాలసీని అందిస్తోంది. ఏడాదికి కేవలం రూ.565 ప్రీమియం చెల్లించి రూ.10 లక్షల వరకు బీమా కవర్ పొందవచ్చని అధికారులు తెలిపారు. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు గలవారు ఈ పాలసీలో చేరవచ్చు. సహజ మరణం మాత్రమే కాకుండా ప్రమాదవశాత్తు మరణం, పాక్షిక వైకల్యం కూడా కవర్ అవుతుంది. మెడికల్ టెస్ట్ అవసరం లేకుండా చేరవచ్చని, ఇన్‌పేషెంట్ చికిత్సకు రూ.1 లక్ష వరకు సాయం లభిస్తుందని పోస్టాఫీస్ అధికారులు పేర్కొన్నారు.