క్రేన్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

0చూసినవారు
క్రేన్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటార్సీ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు, రోడ్డు పక్కన నిలిపి ఉంచిన క్రేన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్