కొండగట్టు ఆంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువా

3452చూసినవారు
కొండగట్టు ఆంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువా
TG: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారికి సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత సూక్ష్మంగా ఓ అద్భుత పట్టు శాలువాను నేశారు. అత్యంత సన్నని దారాలతో, ఎంతో శ్రమించి రూపొందించిన ఈ చేనేత కళాఖండాన్ని హరిప్రసాద్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అధికారులకు భక్తిపూర్వకంగా మంగళవారం అందజేశారు. సిరిసిల్ల చేనేత కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ శాలువాను చూసి ఆలయ అధికారులు, భక్తులు హరిప్రసాద్ ప్రతిభను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్