ఒక రైతు వరి చేనులో ఎలుకల వల్ల గట్లలో రంధ్రాలు ఏర్పడి నీరు నిలవక ఇబ్బంది పడ్డాడు. ఏం చేసినా సమస్య తగ్గక ఆందోళనలో ఉన్నప్పుడు, చేనులోకి ఓ పాము వచ్చింది. రైతు దానిని చంపకుండా వదిలేయగా, ఆ పాము ఎలుకలను నిర్మూలించిందని ఆయన ఓ వీడియో విడుదల చేశారు. కొద్ది కాలంలో గట్ల రంధ్రాలు తగ్గి నీరు నిలవడం ప్రారంభమైందని వివరించాడు. పంటను కాపాడిన ఆ పాముకి రైతు కృతజ్ఞతతో సంతృప్తి చెందాడు. ఘటన ఎక్కడ జరిగిందో కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.