ఆ ఊరిలో వింత ఆచారం.. స్వామివారికి తేళ్లతో పూజలు!

5చూసినవారు
ఆ ఊరిలో వింత ఆచారం.. స్వామివారికి తేళ్లతో పూజలు!
AP: కర్నూలు జిల్లా కోడుమూరులోని కొండలరాయుడి క్షేత్రంలో శ్రావణ మాసం మూడవ సోమవారం నాడు భక్తులు విషపు తేళ్లను చేతులతో పట్టుకుని పూజలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాళ్ల కింద నుంచి తేళ్లను తీసి, స్వామివారికి నైవేద్యంగా సమర్పించి, అభిషేకాలు జరిపిస్తారు. ఆ రోజున తేళ్లు కుట్టవని, కుట్టినా ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే విష ప్రభావం, నొప్పి పోతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దైవభక్తి ముందు విషం కూడా పనిచేయదనే నమ్మకంతో ఏటా వేలాదిమంది భక్తులు ఈ అరుదైన వేడుకలో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్