సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన వింతైన భారీ చేప

9682చూసినవారు
సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన వింతైన భారీ చేప
AP: విశాఖపట్నం ఋషికొండ సముద్రతీరంలో అరుదైన కలిమొయి చేప (స్పాటెడ్ మోరే ఈల్) మృతిచెంది ఒడ్డుకు కొట్టుకువచ్చింది. చిరుతపులి చారల మాదిరిగా ఆకర్షణీయమైన నమూనాలతో కనిపించే ఈ చేప సాధారణంగా లోతైన సముద్ర ప్రాంతాల్లో నివసిస్తుంది. పదునైన దంతాలు కలిగిన ఈ చేప సుమారు 5 మీటర్ల పొడవు వరకు పెరుగుతుందని మత్స్య పరిశోధన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ చేప ప్రధానంగా రాత్రి సమయంలో మాత్రమే వేటాడుతుందని, పగటి వేళ రాళ్ల మధ్య లేదా సముద్ర గర్భంలో దాక్కుని ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.