TG: జగిత్యాల జిల్లా కండ్లపల్లి మోడల్ స్కూల్లో బుధవారం మధ్యాహ్నం ఏడో తరగతి చదువుతున్న మధ్యప్రదేశ్‌కు చెందిన బాలిక అదృశ్యమైంది. ఇష్టం లేని పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారని స్నేహితులకు చెప్పి, మధ్యప్రదేశ్‌కు వెళ్తున్నట్లు లేఖ రాసి వెళ్లిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాలిక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడితో చాట్ చేసినట్లు గుర్తించారు. ఈ పరిచయం వల్లే అదృశ్యమైందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాలిక కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.