
కడుపునొప్పితో ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే.. చేతికి ఇన్ఫెక్షన్
కడుపునొప్పితో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళిన సంగమేశ్వర(33) అనే యువకుడి పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రిలో ఇంజెక్షన్, సెలైన్ ఇచ్చిన తర్వాత అతని చేయి ఎర్రగా వాచింది. డ్యూటీలో ఉన్న డాక్టర్‌కి చెప్తే నిర్లక్ష్యంగా “ఐస్ పెట్టుకో” అని అన్నారట. ఇంటికి వెళ్లాక పరిస్థితి మరింత విషమించడంతో కిమ్స్, యశోదా ఆస్పత్రుల్లో చికిత్స చేయించగా, చేతిని కాపాడుకునేందుకు 35 లక్షల వరకు ఖర్చు అయిందని, ఇంటిని అమ్మకానికి పెట్టామని బాధితుడు వాపోతున్నాడు. డాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.




