వివాహ బంధంతో ఒక్కటైన తెలంగాణ అబ్బాయి, ఫ్రాన్స్‌ అమ్మాయి

87చూసినవారు
తెలంగాణ అబ్బాయి, ఫ్రాన్స్‌ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చైతన్య ఉద్యోగ రీత్యా కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌లో ఉంటున్నాడు. అక్కడ శాన్వి (ఇమామ్‌ బెన్‌) అనే యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. సిరిసిల్లలోని ఓ కల్యాణ మండపంలో వీరి వివాహం వైభవంగా జరిగింది.