మహారాష్ట్రలోని భండారా జిల్లా దేవ్‌హాడిలో, టుమ్సర్ రోడ్ రైల్వే స్టేషన్‌లో 3, 4వ ప్లాట్‌ఫామ్‌ల మధ్య కాళీమాత ఆలయం ఉంది. బ్రిటిష్ కాలం నాటి ఈ ఆలయం రెండు రైల్వే ట్రాక్‌ల మధ్యలో ఉండటం విశేషం. రైల్వే మార్గం విస్తరణ సమయంలో ఆలయాన్ని తొలగించకుండా, దాని చుట్టూ ట్రాక్‌లను నిర్మించారు. రైళ్లు ఆలయానికి అతి సమీపంగా వెళ్లే సమయంలో, లోపల దీపాలు ఆరిపోకుండా తలుపులు మూసివేస్తారు. స్థానికులతో పాటు రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు ఈ ఆలయానికి వస్తుంటారు. నవరాత్రి సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.