హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య!

10చూసినవారు
TG: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్గల్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఆరే రామ్ చరణ్ (15) అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మర్కుక్ మండలం పాతూరు గ్రామానికి చెందిన రామ్ చరణ్ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. అధికారులు విద్యార్థి మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎలా తరలిస్తారంటూ పోలీసులతో కుటుంబ సభ్యుల వాగ్వాదానికి దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్