రాజస్థాన్‌లోని జైపూర్ మాన్ సరోవర్‌లో ఒక ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన మహీంద్రా థార్ వాహనం స్కూటీపై వెళ్తున్న మహిళను బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ఆమెను కొంత దూరం వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. ఈ భయంకరమైన ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనంతో సహా అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.