నిద్రపోతుండగా గొంతులోకి జారిన పళ్ల సెట్టు

33చూసినవారు
నిద్రపోతుండగా గొంతులోకి జారిన పళ్ల సెట్టు
మధ్యప్రదేశ్‌లోని దమోహ్‌ జిల్లాలో కృత్రిమ పళ్లను నిద్రించే ముందు తొలగించకపోవడం వల్ల రామ్‌దాస్‌ (56) అనే వ్యక్తికి ప్రాణాపాయం ఏర్పడింది. అర్ధరాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కుటుంబసభ్యులు అతన్ని సాగర్‌లోని బుందేల్‌ఖండ్‌ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. కృత్రిమ దంతాల సెట్టు శ్వాస మార్గంలో ఇరుక్కుపోయి ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతో వైద్యులు మత్తు ఇచ్చి ఈసోఫేగోస్కోప్‌తో వాటిని విజయవంతంగా బయటకు తీశారు. ప్లాస్టిక్‌ పళ్ల సెట్టు కావడంతో ఎక్స్‌రేలో స్పష్టంగా కనిపించలేదు, ఇది వైద్యులకు సవాలుగా మారింది.