సహజీవనం సాగిస్తూ మహిళను హతమార్చిన దుర్మార్గుడు

33315చూసినవారు
సహజీవనం సాగిస్తూ మహిళను హతమార్చిన దుర్మార్గుడు
AP: సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జాలరిపేటలో బుధవారం చోటు చేసుకుంది. ఒలిశెట్టి కోదండ, పరవాడలో ఉంటున్న లక్ష్మి(45) కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. బుధవారం కూడా గొడవ జరగగా.. మద్యం మత్తులో ఉన్న కోదండ కత్తితో లక్ష్మిని పొడిచి, అనంతరం కర్రతో తలపై కొట్టి హత్య చేశాడు. తరువాత మృతదేహం పక్కనే ఉన్న మంచంపై దర్జాగా పడుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్