22 ఏళ్లకే ఆరుసార్లు గర్భం దాల్చిన మహిళ!

8చూసినవారు
యూపీలోని బాగ్‌పత్ జిల్లాకు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రజ్ఞా తోమర్, రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల గర్భిణీ కేసును సోషల్ మీడియాలో పంచుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహిళకు ఇప్పటికే ఐదుగురు పిల్లలు (నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు) ఉండగా, ఆరవ బిడ్డతో ఐదు నెలల గర్భవతి. 15-16 ఏళ్లకే బాల్య వివాహం జరిగినట్లు ఆమె తెలిపారు. మగపిల్లల పట్ల ఉన్న మోజుతో, కుటుంబ సభ్యుల కోరిక మేరకు పదేపదే గర్భం దాల్చడం మహిళ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్ తోమర్ ఆందోళన వ్యక్తం చేశారు. గర్భధారణల మధ్య తగినంత విరామం పాటించాలని, మహిళ ప్రాణాలను ప్రమాదంలో పడేయొద్దని దంపతులను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్