AP: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డికి చెందిన ధనుంజయ గౌడ్ (27) శశికలతో వివాహానికి ముందే ప్రేమలో పడ్డాడు. పెద్దల అంగీకారం లేక ఇద్దరూ వేరే పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ, పెళ్లి తరువాత వారి సంబంధం కొనసాగింది. భర్త, పిల్లలను వదిలి శశికల ప్రియుడి దగ్గరకు వచ్చి హాస్టల్‌లో ఉంటూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. ఫ్యాన్‌కి ఉరి బిగించుకొని సెల్ఫీ ఫోటో పెట్టింది. భయపడ్డ ధనుంజయ లెటర్ రాసి పురుగుమందు తాగి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.