
ఉద్యోగం మానేశాక పీఎఫ్ డబ్బులు వెంటనే తీయకండి: నిపుణులు
ఉద్యోగం మానేసిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డబ్బులను వెంటనే విత్ డ్రా చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగం మానేసిన లేదా రిటైర్ అయిన మూడేళ్ల వరకు పీఎఫ్ బ్యాలెన్స్‌పై 8.25% వడ్డీ లభిస్తుంది, ఇది బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ. పీఎఫ్ ఖాతా మూడేళ్ల తర్వాతే ఇనాక్టివ్ అవుతుంది, అప్పుడు కూడా సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. కాబట్టి, అత్యవసరం లేకపోతే పీఎఫ్‌లోనే డబ్బులు ఉంచడం వల్ల అధిక వడ్డీతో పాటు చక్రవడ్డీ లాభం కూడా పొందవచ్చు.




