రాజస్థాన్లోని దౌసా జిల్లా సంలేటి గ్రామంలో
క్రికెట్ ఆడుతుండగా 25 ఏళ్ల రాంరాజ్ మీనా అనే యువకుడు అకస్మాత్తుగా ఛాతీ నొప్పితో కుప్పకూలాడు. స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాథమిక విచారణలో గుండెపోటు కారణంగానే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐదు నెలల క్రితమే రాంరాజ్ మీనాకు వివాహం జరగడం గమనార్హం.