TG: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని సరంపల్లి గ్రామానికి చెందిన పెద్ద చెరువులో బుధవారం సాయంత్రం చేపలు పట్టడానికి వెళ్లిన బోడదారి స్వామి(25) అనే యువకుడు ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందాడు. గురువారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ తండ్రి రోదన అందరిని కంటతడి పెట్టించింది. మృతుడు స్వామి తల్లి పదేళ్ల క్రితమే చనిపోయింది.