మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న అనంతరం 32 ఏళ్ల వ్యక్తి ఉండాసా చెరువులో ఈత కొడుతూ నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. సదరు వ్యక్తి నీటిలోకి దిగుతుండగా అతని స్నేహితురాలు ఫోన్ లో వీడియో రికార్డ్ చేస్తోందని, అదే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.