బాసర బ్రిడ్జిపై ఫోటోలు తీస్తూ నదిలో పడిన యువకుడు

83చూసినవారు
బాసర బ్రిడ్జిపై ఫోటోలు తీస్తూ నదిలో పడిన యువకుడు
నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్‌ గ్రామానికి చెందిన రమావత్‌ సాయికిరణ్‌ (25) గోదావరి నదిలో పడి మృతి చెందాడు. యూకేలో ఎంబీఏ చేస్తున్న సాయికిరణ్‌ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 5న తిరిగి యూకే వెళ్లాల్సి ఉండగా, నిన్న బాసర ఆలయ దర్శనం అనంతరం బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. గాలింపు చేపట్టగా బుధవారం అతని మృతదేహం లభ్యమైంది.

సంబంధిత పోస్ట్