ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని నేహా ఖాన్ (18)ను ఆమె ప్రియుడు సమీర్ నమ్మించాడు. ఇంట్లోని నగదు, బంగారం తీసుకురావాలని చెప్పడంతో.. నేహా రాత్రివేళ రూ.1.35 లక్షల నగదు, బంగారంతో అతడి వద్దకు వచ్చింది. అనంతరం సమీర్ మరో ముగ్గురు స్నేహితుల సాయంతో ఆమెను హత్య చేశాడు. మృతదేహాన్ని పొలం సమీపంలోని ట్యూబ్‌వెల్‌లో పడేసి డబ్బులతో నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సమీర్‌తో పాటు అర్షద్, అర్సలాన్, అమిత్‌లను అరెస్టు చేశారు.