మద్యం మత్తులో ఉన్న యువకుడు కారు డ్రైవ్ చేసి బీభత్సం సృష్టించాడు. గోవా రాజధాని పనాజిలో మంగళవారం ఒక యువకుడు మద్యం మత్తులో కారు నడిపాడు. అయితే కారును రివర్స్ చేసే క్రమంలో యాక్సిలరేటర్‌ను బలంగా నొక్కాడు. దీంతో ఆ కారు అదుపుతప్పింది. రివర్స్‌లో వేగంగా వెనక్కి వెళ్తూ బైకులను ఢీకొట్టి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. అక్కడున్న 50 ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో కారు, షాపు గోడ మధ్య చిక్కుకున్న అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ SMలో వైరల్ అవుతోంది.