గడ్డియంత్రంలో 3 ముక్కలైన పాము.. తలభాగం కాటేసి యువతి మృతి

29చూసినవారు
గడ్డియంత్రంలో 3 ముక్కలైన పాము.. తలభాగం కాటేసి యువతి మృతి
మధ్యప్రదేశ్‌ మురైనా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సబల్‌గఢ్‌ సమీప గ్రామంలో గడ్డి కత్తిరిస్తున్న యువతి పాము కాటుకు బలైంది. భర్తి కుశ్వాహా (18) అనే యువతి ఇంటి వద్ద గడ్డి యంత్రంతో గ్రాస్‌ని కట్‌ చేస్తుండగా.. గడ్డి మధ్య దాగి ఉన్న పాము కూడా కట్ అయ్యింది. మూడు ముక్కలైన పాము తలభాగం యువతిని కాటేసింది. కుటుంబసభ్యులు వెంటనే నాటువైద్యుడి వద్దకు తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సంబంధిత పోస్ట్