బెంగళూరు శివార్లలోని అనేకల్ పట్టణం హోసూర్ మెయిన్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలేజీ నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తున్న ఇంచారా (20) అనే విద్యార్థినిని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో ఆమె అదుపుతప్పి లారీ వెనుక చక్రాల కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Video Credit: PulseNews