శివయ్య పిలుస్తున్నాడని.. డిప్రెషన్‌లో యువతి అదృశ్యం

0చూసినవారు
శివయ్య పిలుస్తున్నాడని.. డిప్రెషన్‌లో యువతి అదృశ్యం
TG: మేడిపల్లిలో నివాసముంటున్న మధుహసిత(19) అనే యువతి 'నన్ను శివయ్య పిలుస్తున్నాడు, నేను వెళ్లిపోతున్నా' అని లేఖ రాసి అదృశ్యమైంది. గతంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడటంతో కుటుంబ సభ్యులు మందలించగా, అతనితో మాట్లాడటం మానేసింది. ఈ నెల 27న సాయంత్రం తల్లి ఇంటికి రాగా యువతి కనిపించలేదు. ఇంట్లో లభించిన లేఖలో తాను డిప్రెషన్‌లో ఉన్నానని, లార్డ్ శివయ్య పిలుస్తున్నాడని పేర్కొంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్