ఆధార్ సర్వీస్ ఛార్జీలను అక్టోబర్ 1 నుంచి పెంచుతున్నట్లు ఉడాయ్ ప్రకటించింది. తప్పుల సవరణకు లేదా వివరాల అప్డేట్‌కు ప్రస్తుతం రూ.50 ఉండగా రూ.75కు, బయోమెట్రిక్ అప్డేట్ కోసం రూ. 100 ఉండగా రూ.125కు పెంచుతున్నట్లు తెలిపింది. పోర్టల్ ద్వారా నేరుగా పొందే సేవలకు ఛార్జీలను రూ.50 నుంచి రూ.75కు పెంచినట్లు చెప్పింది. పోయిన ఆధార్ స్థానంలో కొత్తది కావాలంటే రూ.40 అప్లికేషన్ ఫీజు చెల్లించాలని పేర్కొంది.