ఇకపై రెస్టారెంట్లకు వెళ్లాలంటే ఆధార్ తప్పనిసరి!

4873చూసినవారు
ఇకపై రెస్టారెంట్లకు వెళ్లాలంటే ఆధార్ తప్పనిసరి!
ఆధార్ కార్డు భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. త్వరలో రెస్టారెంట్లు, హోటళ్లు, అపార్ట్‌మెంట్లు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఆధార్ ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ తప్పనిసరి కానుంది. UIDAI దీని కోసం ఒక కొత్త యాప్‌ను తీసుకురానుంది. ఈ యాప్‌లో ఆధార్ వివరాలు కనిపించకుండా కేవలం క్యూఆర్ కోడ్, ఫోటో మాత్రమే ఉంటాయి. దీనివల్ల జిరాక్స్ కాపీల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు. ఈ విధానం అమల్లోకి వస్తే స్టేడియాలు, సినిమా హాళ్లు, ఆఫీసులు, ఆస్పత్రుల్లో కూడా ఆధార్ వెరిఫికేషన్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.