సాంకేతికతపై అవగాహనతో ఆధార్ కార్డు డౌన్‌లోడ్, వివరాల మార్పులు, చేర్పుల కోసం ఆధార్ కేంద్రాలు, నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇటీవల విడుదలైన ఆధార్ యాప్‌తో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు, క్షణాల్లో ఈ పనులన్నీ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుండి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఆధార్ వివరాలు నమోదు చేసి, ఫోన్ నంబరు, అడ్రస్ అప్‌డేట్ వంటివి కూడా ఫేస్ రికగ్నిషన్ నిర్ధారణ ద్వారా క్షణాల్లో పూర్తి చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు.