
నగరవాసులకు అలర్ట్.. జంట జలాశయాల నుంచి నీటిని విడుదల
హైదరాబాద్ నగర శివార్లలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో, అధికారులు గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నదిలో వరద ఉధృతి పెరిగింది. ఉస్మాన్ సాగర్ నుంచి 920 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ నుంచి 1,017 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద తీవ్రతను బట్టి ఈ విడుదల మరింత పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులు తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.




