ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Apr 10, 2026, 14:04 IST/

నర్మదా నదిలో వేల లీటర్ల పాలు.. నెటిజన్ల ఆగ్రహం

Apr 10, 2026, 14:04 IST
మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో చైత్ర నవరాత్రి సందర్భంగా శ్రీ దాదాజీ దర్బార్ పాతాళేశ్వర మహాదేవ్ ఆలయంలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో భాగంగా, 11,000 లీటర్ల పాలను నర్మదా నదిలోకి వదిలేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. లోక కల్యాణం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాకులు, భక్తులు చెబుతున్నప్పటికీ, పోషకాహార లోపంతో బాధపడుతున్న రాష్ట్రంలో పాలను వృథా చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ నిపుణులు కూడా నదిలో పాలు కలపడం వల్ల నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి జలచరాలకు హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.