పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ ఎమ్మెల్యే, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మంజీందర్ సింగ్ లాల్‌పురాకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. 2013లో ఓ దళిత మహిళపై లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలడంతో ఈ శిక్ష ఖరారైంది. రెండు రోజుల క్రితం న్యాయస్థానం ఆయనను నేరస్థుడిగా నిర్ధారించగా, శుక్రవారం శిక్షను ప్రకటించింది. మంజీందర్‌తో పాటు మరో ఆరుగురికి కూడా నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధించారు.