
మార్చి 1 నుంచి వచ్చే మార్పులు ఇవే!
మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా పలు కీలక నియమాలు అమల్లోకి రానున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ల ధరలు మారనున్నాయి, చమురు మార్కెటింగ్ కంపెనీలు కొత్త రేట్లను ప్రకటించనున్నాయి. భారతీయ రైల్వేలు పాత UTS యాప్‌ను నిలిపివేసి, కొత్త RailOne యాప్‌ను ప్రవేశపెట్టనున్నాయి. టెలికాం శాఖ సిమ్-బైండింగ్ నియమాలను తప్పనిసరి చేసింది, దీని ప్రకారం ప్రతి మెసేజింగ్ యాప్ ఖాతాను యాక్టివ్ సిమ్‌కి లింక్ చేయాలి. అలాగే, వెబ్/డెస్క్‌టాప్ లాగిన్లకు ఆరు గంటల ఆటో-లాగ్అవుట్ నియమం అమలవుతుంది.




