
హైదరాబాద్లో రోడ్డుపై కుప్పకూలి వ్యక్తి మృతి (వీడియో)
గ్రేటర్ హైదరాబాద్లో గుండెపోటుతో మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ క్రమంలో ఉప్పల్ మండలం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని SVD వైన్స్ ముందు రోడ్డుపై సుమన్ అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. స్థానికులు గమనించేసరికి అతను అప్పటికే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి, గుండెపోటుతోనే మరణించినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.




