ఆసియా క్రీడల క్రికెట్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగాడు. ఏడు సిక్సర్లతో అదరగొట్టిన అతడు.. టీ20ల్లో 3,513 బంతుల్లోనే 400 సిక్సర్లు పూర్తి చేసి ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 3,557 బంతుల్లో ఈ మైలురాయి చేరిన క్రిస్ గేల్‌ను అధిగమించాడు. అలాగే భారత్-పాక్ టీ20ల్లో 14 సిక్సర్లతో విరాట్
కోహ్లీ (11)ను వెనక్కి నెట్టి అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.