
ఐఫోన్ యూజర్లకు భారత ప్రభుత్వం వార్నింగ్!
ఆండ్రాయిడ్‌తో పోలిస్తే ఐఫోన్ సేఫ్ అనుకుంటారు కానీ ఇప్పుడు వాటికీ హ్యాకింగ్ ముప్పు ఉందని CERT-ఇండియా హెచ్చరించింది. iOS/iPadOS 18.7.1 కంటే పాతవి, macOS Sonoma 14.8.1, Sequoia 15.7.1 కంటే పాత వర్షన్లలో సెక్యూరిటీ లోపం ఉన్నట్టు తెలిపింది. హ్యాకింగ్ అయితే యాప్స్ క్రాష్ అవ్వడం, సిగ్నల్ కోల్పోవడం జరుగుతుందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని సూచించింది.




