ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం.. 22 బంతుల్లోనే అర్ధశతకం (వీడియో)

20975చూసినవారు
ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (52 నాటౌట్) అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధశతకం సాధించి, శ్రీలంక బౌలర్లను బెంబేలెత్తించాడు. ఇది ఈ టోర్నీలో అతనికి వరుసగా మూడవ అర్ధశతకం. అభిషేక్ ధాటికి భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ (4) త్వరగా ఔటైనా, అభిషేక్ జోరు కొనసాగించాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you