అభిషేక్ శర్మ జోరు: యువరాజ్ రికార్డు బ్రేక్ చేస్తాడా?

10006చూసినవారు
అభిషేక్ శర్మ జోరు: యువరాజ్ రికార్డు బ్రేక్ చేస్తాడా?
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి, అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. 20 బంతుల్లో 68 పరుగులు చేసి, టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో, అతని గురువు యువరాజ్ సింగ్ తన రికార్డును ఎప్పుడు బ్రేక్ చేస్తావంటూ అభిషేక్‌కు సవాల్ విసిరాడు. నెటిజన్లు అభిషేక్‌ను 'మోడ్రన్ యువరాజ్'గా అభివర్ణిస్తూ, త్వరలోనే యూవీ రికార్డును అధిగమిస్తాడని ఆశిస్తున్నారు. భారత్-న్యూజిలాండ్ నాలుగో మ్యాచ్ జనవరి 26న విశాఖపట్నంలో, చివరి మ్యాచ్ జనవరి 31న తిరువనంతపురంలో జరగనుంది.

సంబంధిత పోస్ట్