
బెలూన్ గ్యాస్‌ను కనిపెట్టింది గుంటూరులోనే (వీడియో)
గుంటూరు పేరు వింటే మనకు ముందుగా గుర్తొచ్చేది మిరప ఘాటు, పులిహోర దోశ. కానీ ఈ చారిత్రక నగరం ప్రపంచ శాస్త్ర చరిత్రలో కూడా తన ప్రత్యేక గుర్తింపును సంపాదించింది.. అదే హీలియం మూలకం ఆవిష్కరణ. మనం సాధారణంగా బెలూన్లలో ఉపయోగించే ఈ గ్యాస్ గాలి కంటే తేలికైనది, రంగు, వాసన, రుచి లేని తటస్థమైన వాయువు. హైడ్రోజన్ తర్వాత విశ్వంలో అత్యధికంగా లభించే మూలకం ఇది.




