Top 10 viral news 🔥

ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ముగ్గురు వ్యక్తులు స్పాట్ డెడ్
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గువనపల్లి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. రాయదుర్గానికి చెందిన వారు కర్ణాటకలోని మొలకల్మూర్లో వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.




