ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


120 డాలర్లు దాటిన బ్రెంట్‌ క్రూడాయిల్ ధర
Mar 10, 2026, 00:03 IST/

120 డాలర్లు దాటిన బ్రెంట్‌ క్రూడాయిల్ ధర

Mar 10, 2026, 00:03 IST
అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. సోమవారం ట్రేడింగ్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 120 డాలర్లకు చేరుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, ఇరాన్‌ హొర్ముజ్‌ జలసంధిని మూసివేయడం వంటి పరిణామాలతో ముడి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావం భారతీయ వ్యాపార రంగంపై, ఇంధన ధరలపై పడనుంది. దేశీయంగా ఇంధన అవసరాలు ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం, రష్యా నుంచి దిగుమతులు తగ్గడం వంటి కారణాలతో పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది.