మొక్కజొన్న పంట తిని సుమరు 50 నెమళ్లు మృతి

38చూసినవారు
మొక్కజొన్న పంట తిని సుమరు 50 నెమళ్లు మృతి
తమిళనాడులోని తెన్‌కాశీ జిల్లా మీనాక్షిపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రైతు జాన్సన్ తన మొక్కజొన్న పంటను పక్షులు, జంతువుల నుంచి రక్షించేందుకు ఆహార పదార్థాలలో ఎలుకల మందు కలిపి పెట్టాడు. ఈ దుష్పరిణామం కారణంగా అక్కడికి వచ్చిన సుమారు 50 నెమళ్లు ఆ ఆహారం తిని స్పాట్‌లోనే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసుల సహకారంతో ఘటనా స్థలానికి చేరుకుని నెమళ్ల క‌ళేబ‌రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. రైతును అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్