ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. పాక్ పై దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 74 (39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు) పరుగులకు ఔట్ అయ్యాడు. అబ్రార్ అహ్మద్ వేసిన 13 ఓవర్‌లో తొలి బంతికి సిక్స్ కొట్టిన అభిషేక్.. తర్వాత బంతికే రవూఫ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 13 ఓవర్లకు భారత్ స్కోరు 126/3గా ఉంది. క్రీజులో తిలక్ (2), సంజు (2) పరుగులతో ఉన్నారు.