
ఓటేయడానికి సైకిల్‌పై 148 కి.మీ ప్రయాణం
TG: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు మాజీ సైనికుడు మల్లయ్య సైకిల్‌పై 148 కి.మీ ప్రయాణం చేశారు. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున 4:20 నిమిషాలకు BHEL నుంచి బయలుదేరి 10 గంటలకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. సైకిల్‌పై వచ్చి ఓటు వేయడంతో గ్రామస్థులు ఆయనను ప్రశంసించారు.




