2030 నాటికి భారతదేశంలో అత్యధిక గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల చేసే గృహోపకరణాలుగా ఏసీలు మారతాయని ఓ సర్వే తెలిపింది. అంతేకాకుండా 2035 నాటికి మొత్తం ఉద్గారులు రెండింతలు పెరిగి 329 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్కు సమానంగా చేరుతాయని థింక్ ట్యాంక్ iFOREST తాజా సర్వేలో వెల్లడించింది. 2024లో మాత్రమే ఏసీల వల్ల 156 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు విడుదలయ్యాయి. ఇది దేశంలోని అన్ని ప్రయాణీకుల కార్ల ఉద్గారాలకు సమానం.