లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యాశాఖ జూనియర్‌ అసిస్టెంట్‌

40చూసినవారు
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యాశాఖ జూనియర్‌ అసిస్టెంట్‌
హైదరాబాద్‌ నగరంలోని బండ్లగూడ డిప్యూటీ విద్యాశాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివప్రసాద్, బుధవారం రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పదవ తరగతి పరీక్ష కేంద్రం నుంచి తమ పాఠశాలను తొలగించవద్దని కోరిన స్కూల్ యాజమాన్యం నుంచి ఈ లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. శివప్రసాద్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్