TG: హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి శుక్రవారం రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ హనుమకొండలోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో తనిఖీల్లో రూ.30 లక్షల నగదు, పెద్ద ఎత్తున ల్యాండ్ డాక్యుమెంట్లు, లాకర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో సీఐలు తనిఖీలు నిర్వహించారు.