AP: టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి 7 బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. తిరుపతిలోని ఆయన నివాసంతో పాటు తిరుమలలోని వసతిగృహం, బావమరుదుల ఇళ్లు, ఏర్పేడు మండలం చెల్లూరులోని సోదరుడి ఇంట్లోనూ సోదాలు కొనసాగాయి. ఎస్‌బీఐ లాకర్లను కూడా అధికారులు పరిశీలించారు. తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలు గుర్తించినట్లు సమాచారం. కాగా, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.